ప్రిన్స్ మహేష్ బాబు తాను నటించే సినిమాలలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల ప్రస్తావనలు కాని ఆ సినిమాల టైటిల్స్ కాని ఉపయోగించుకోవడానికి పెద్దగా మోజు చూపెట్టడు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్ అక్కినేని సినిమా టైటిల్ పై మక్కువ చూపెడుతున్నాడు అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.  ప్రస్తుతం మహేష్ కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని కొరటాల శివ ఆలోచిస్తున్నట్లు టాక్. గతంలో చాల సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఇదే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. ఆ రోజులలో ‘శ్రీమంతుడు’ మంచి విజయాన్నే సాధించింది.  అయితే ఇప్పుడు అదే టైటిల్ మహేష్ కొత్త సినిమాకు టైటిల్ కాబోతోంది అనే వార్తలు హడావిడి చేస్తున్నా ఈ వార్తలు ఎంత వరకు నిజం అన్న సందేహం అందరికీ ఉంది. దీనికి కారణం మహేష్ కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా టైటిల్ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో పేర్లు బయటకు వచ్చాయి. అలా వార్తలు వచ్చినప్పుడల్లా కొంత గ్యాప్ తీసుకుని కొరటాల ఈ గాసిప్పులను ఖండిస్తూ వచ్చాడు.  మరి ఈ ‘శ్రీమంతుడు’ వ్యవహారం రానున్న రోజులలో ఎటువంటి టర్నింగ్ తీసుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: