ఎన్నో వరస ఫ్లాప్ ల తరువాత తిరిగి సక్సస్ సాధించడం అంత సులువు కాదు. కానీ అటువంటి అద్భుతాన్ని హీరో నితిన్ సాధించి తన యంగ్ హీరో ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు. అటువంటి నితిన్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘చిన్నదాన నీకోసం’ సినిమాను ఏకంగా మెగా కుటుంబ హీరో సినిమాను టార్గెట్ చేస్తూ ఈనెల 24వ తారీఖున వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో పోటీగా విడుదల చేయడం బట్టి నితిన్ సాహసం చేస్తున్నాడా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.  అయితే నితిన్ సాహసం పైకి అనకపోయినా మెగా కుటుంబాన్ని ముఖ్యంగా నాగబాబుని భయ పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ముకుంద సినిమాలాగే నితిన్ సినిమా కూడా ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి ఒకేరోజు ఈ రెండు సినిమాలు జనం ముందుకు వస్తే ఈ అనవసరపు పోటీ వల్ల ‘ముకుంద’ ఓపెనింగ్స్‌పై దాని ప్రభావం పడుతుందని వార్తలు వస్తున్నాయి.  అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ ఇరు చిత్రాల నిర్మాతల నడుమ చర్చలు జరుగుతున్నాయట. వీరిద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తే ‘చిన్నదాన నీ కోసం’ రిలీజ్‌ వారం వాయిదా పడే అవకాశముందని అనుకుంటున్నారు. అయితే జనవరి 1న విడుదల చేయడం వల్ల ‘చిన్నదాన నీకోసం’ అటు క్రిస్మస్‌ హాలిడేస్‌ ను వదులుకుని కేవలం సంక్రాంతిని ఆధారంగా చేసుకుని జనం ముందుకు వస్తే సంక్రాంతి భారీ సినిమాల ముందు తన సినిమా నిలబడగలదా ? అని నితిన్ ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా నితిన్ ఈనెల 20వ తారీఖున తిరుపతిలో తన సినిమా ఆడియో సక్సస్ మీట్ ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్ననేపధ్యంలో తాను తెలంగాణా యంగ్ హీరోని మాత్రమే కాదు సీమాంద్ర ప్రాంతపు అభిమానుల హీరోని అని తెలియచేసే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగం తిరుపతిలో జరగబోతున్న ఆడియో సక్సస్ మీట్ అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: