హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకుండానే అఖిల్ పట్ల అమ్మాయిలలో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలియచెప్పే ఒక ఆ శక్తికర సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగింది. భాగ్యనగరంలోని మెహదీపట్నం ప్రాంతంలో ఉన్న సెయింట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజ్ నిర్వహించిన ‘మేకింగ్ ఎ డిఫరెన్స్’ అనే పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమానికి ఆతిధిగా వెళ్ళాడు అఖిల్.  అయితే అఖిల్ ని చూడగానే కాలేజీ అమ్మాయిలలోని ఉత్సాహం హద్దులుదాటి అమ్మాయిలు అంతా గుంపులు గుంపులుగా అఖిల్ వెంట పడటమే కాకుండా అఖిల్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, సేల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి తెగ సరదా పడ్డారట. అఖిల్ చుట్టూ సెక్యూరిటీ ఉన్నా అఖిల్ మొహం, మీసాలు, గడ్డం, వీపు తడిమి భయపెట్టారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీనితో ఖంగారు పడ్డ అఖిల్ ఏదోవిధంగా ఆ కాలేజీ నిర్వహించిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బయటపడ్డాడని టాక్. అఖిల్ కు ఇంత క్రేజ్ ఉంది కాబట్టే టైటాన్ వాచ్ కంపెనీ, మౌంట్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు అఖిల్ నటించిన మొదటి సినిమా విడుదల కాకుండానే అఖిల్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని ప్రకటనల పై కోట్లు గుమ్మరిస్తున్నాయి.  తన తల్లి అమల లాగే సామాజిక కార్యక్రామాలపట్ల అభిరుచి కనబరిచే అఖిల్ ను ఈమధ్య హైదరాబాద్ లోని రోటరీ అంతర్జాతీయ సంస్థ కాన్ఫరెన్స్ కు అతిధిగా పిలిచి గౌరవించింది అంటే అఖిల్ క్రేజ్ అమ్మాయిలలోనే కాదు ప్రముఖ సేవా సంస్థలలో కూడా ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: