టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రచయితల హావా ఎక్కువుగా నడుస్తుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇప్పటి వరకూ పలు చిత్రాలకి రచయితలుగా పనిచేసిన వారు, ఇప్పుడు దర్శకులుగా మారి, వారి సత్తాని చాటుతున్నారు. దీంతో అగ్రహీరోల మూవీలకి పనిచేసిన రచయితలకి డిమాండ్ పెరుగుతుంది. ఈ లిస్ట్ లో కోనవెంకట్, కొరటాలశివ పేర్లు ప్రధమంగా వినిపిస్తున్నాయి. అయితే కొరటాల శివ, మహేష్ బాబు మూవీకి సంబంధించిన పనుల్లో బిజిగా ఉంటే, కోనవెంకట్ కూడ పలు మూవీలకి కథలని అందిస్తూ బిజిగా ఉన్నాడు. అలాగే యంగ్ హీరో తో దర్శకుడిగా పనిచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఈ మధ్య కాలంలో కోనవెంకట్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని కలిసినట్టుగా క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ మూవీ రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోనవెంకట్ ఇప్పటికే రామ్ చరణ్ కి ఓ కథని వినిపించాడు. కోనవెంకట్ చెప్పిన కథకి ఎటువంటి రిమార్క్స్ లేకుండా చరణ్ బాగుందని చెప్పడంతో, వీరిద్దరి కాంబినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రసుత్తం రామ్ చరణ్, శ్రీనువైట్ల మూవీకి సంబంధించి పనుల్లో బిజిగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తరువాత, కోనవెంకట్ మూవీ ఉంటుందేమో అంటూ ఫిల్మ్ నగర్ సమాచారం. మొత్తంగా కోనవెంకట్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఎటువంటి రిజల్ట్ ని ఇస్తుందో అనేది మరో హాట్ టాపిక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: