కోలీవుడ్ హీరో విజయ్ ని అభిమానించే యువతరం లక్షల సంఖ్యలో తమిళ నాడులో ఉన్నారు. ‘కత్తి’ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం విజయ్ ఏమి మాట్లాడినా అటు మీడియాకే కాకుండా ఇటు యూత్ కు కూడా హాట్ టాపిక్ గా మారిపోతోంది. విజయ్ హీరోగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 22 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో తన ట్విటర్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు యువతరానికి హాట్ టాపిక్ గా మారింది. తమ తల్లితండ్రులను పట్టించుకోకుండా వారు చెప్పినట్లు సరిగ్గా ప్రవర్తించకుండా అయోమయంలో కాలం గడుపుతూ కేవలం తన సినిమాలను చూసినంత మాత్రాన అభిమానులు తన దృష్టిలో నిజమైన తన అభిమానులు కారు అంటూ తన అభిమానుల పై సంచలన వ్యాఖ్యాలు చేసాడు విజయ్.  అంతేకాదు తాను తన అభిమానుల దగ్గర పనిచేసే ఒక ఉద్యోగిని అని వారిని నిరంతం ఆనంద పెట్టే ఉద్యోగం చేస్తూ తాను డబ్బులు సంపాదిస్తున్నాను కాని తాను చేస్తున్న సమాజసేవ ఏమిలేదు అంటూ తన నిరాడంబరతను చాటుకున్నాడు విజయ్. ఇదే సందర్భంలో విజయ్ మరో అడుగు ముందుకు వేసి మనకు జన్మను ఇచ్చిన తల్లి యాదృచ్చికమైన బహుమతి అయితే, భార్య దేవుడు ఇచ్చిన బహుమతి అదేవిధంగా స్నేహితులు అరుదైన బహుమతులు అంటూ చివరికి విజయ్ తన అభిమానులు మాత్రం విలువ కట్టలేని బహుమతులు అంటూ తన కృతజ్ఞతను తెలియ చేస్తూ పెట్టిన ట్విట్ విజయ్ ఇమేజ్ ని మరింత పెంచేసింది అనే వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: