సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగ మూవీ, బాక్సాపీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ కలెక్షన్స్ అంతా వారం రోజుల తరువాత అమాంతంగా తగ్గిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2500 పైగా స్క్రీన్ లలో విడుదలైన ‘లింగ’ సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ నిసొంతం చేసుకుంది. విమర్శకులు సినిమా చూసి పెదవి విరిచారు. అయితే నాలుగేళ్ళ తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకి పరుగులు పెడుతున్నారు. కొన్ని ధియోటర్స్ లో అయితే వారం రోజుల వరకు అడ్వాన్సు బుకింగ్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా అభిమానుల ఊహించినదానికంటే తక్కువుగా ఉండటంతో, అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. సినిమాని చూడటానికి వస్తున్న ప్రేక్షకులు మాత్రం ఈ మూవీని ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే, రజనీకాంత్ ని మాత్రం చూడానికి వస్తున్నాము.. అని క్లియర్ గా చెబుతున్నారు. దీని వల్ల మూవీ ఆశించినంత లేకపోయినా, లింగకి కలెక్షన్స్ వెల్లువ కొనసాగుతూనే వస్తుంది. ఇదిలా ఉంటే, లింగ సినిమా నిడివి 174 నిముషాలు వరకూ ఉంది. ఈ నిడివి చాలా ఎక్కువైందనే టాక్ వినిపిస్తుంది. దీంతో లింగ మూవీ లెన్త్ ని తగ్గించాలని చిత్ర యూనిట్ భావించింది. దాదాపు 9 నిముషాలను లింగ్ మూవీని తొలగించారు. తొలగించిన నిముషాల ఈనాటి షో నుండి ప్రదరిస్తున్నారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో బోర్ గా ఉన్న సీన్స్ ని 6 నిముషాలు పాటు, అలాగే సెకండ్ హాఫ్ లో 3 నిముషాల సీన్స్ ని తొలగించారు. ట్రిమ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: