ప్రతి దర్శకుడికి ఒక బాణీ ఉంటుంది, ఆ పద్ధతిలోనే సినిమాను తీస్తూ ఉంటారు దర్శకులు. శ్రీకాంత్ అడ్డాల ఇప్పటి వరకు దర్శకత్వం వహించింది కేవలం రెండు సినిమాలు మాత్రమే అయినా తన విభిన్నమైన బాణీతో ప్రేక్షకులలో తనకు ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో హీరోలుగా నటించిన వెంకటేష్, మహేష్ ల పాత్రలకు సినిమాలో పేర్లు లేవు. వారిద్దరినీ అందరిచేత పెద్దోడా చిన్నోడా అని శ్రీకాంత్ అడ్డాల పిలిపించాడు. ఇదే పంధాను కొనసాగిస్తూ రాబోతున్న ‘ముకుంద’ సినిమాలో కూడా హీరో, హీరోయిన్స్ కు తమ పాత్రలకు సంబంధించి పేర్లు అనేవి లేకుండా మొత్తం సినిమా కథను నడిపించాడు అన్న విషయాన్ని హీరోయిన్ పూజ హెగ్డే  మీడియా తో మాట్లాడుతూ ముకుందుడు గుట్టు విప్పింది.  అంతేకాదు ఈ సినిమాలో హీరోగా నటించిన వరుణ్ తేజ్ గురించి ఈమె మాట్లాడుతూ భవిష్యత్ లో వరుణ్ తేజ్ చాల పెద్ద హీరో అవుతాడని అతడివి చాల ఎక్స్ ప్రెసివ్ ఐస్ అంటూ పెద్ద కితాబ్ ఇచ్చింది పూజా. ఇన్ని అంచనాలు ఉన్నాయి. కాబట్టే ఈ సినిమాకు బయ్యర్లు క్యూ కట్టడమే కాకుండా వరుణ్ తేజ్ పై ఉన్న నమ్మకంతో భారీ రేట్లకు ఈ సినిమాను కొన్నారు.  ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకున్నా ముకుందుడు భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: