వరస పెట్టి భారీ సినిమాలలో నటిస్తున్న అనుష్క నోటి వెంట ఆశ్చర్యకరమైన మాటలు వస్తున్నాయి. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేటి తరం హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది అనుష్క. ప్రస్తుత తరం హీరోయిన్స్ తాము కలకాలం ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకునే పాత్రలను చేయడానికి అభిరుచి ఉన్నా అటువంటి పాత్రలను చేయడానికి అవకశాలు రావడం లేదని అనుష్క అభిప్రాయo.  ఒకవేళ సాహసించి ఏ హీరోయిన్ అయినా మంచి పాత్రలు చేయడానికి ప్రయత్నించినా ప్రేక్షకులు తమను ఆదరించడంలేదని, దీనితో సమర్ధత ఉండి కూడా చాలామంది హీరోయిన్స్ అందమైన డాల్స్ లా మారిపోతున్నారని వ్యాఖ్యలు చేసింది అనుష్క. అంతేకాదు ప్రస్తుత పరిస్థుతులలో తనతో సహా అందరి హీరోయిన్స్ సీజనల్ ఫ్రూట్స్ లా మారిపోయామని ఒక సీజన్ లో తిన్న పండును మరొక సీజన్ కు వచ్చే సరికి ఎలా వదిలేస్తామో ప్రస్తుత హీరోయిన్స్ పరిస్థితి కూడా అలాగే ఉందని సంచలన కామెంట్స్ చేసింది అనుష్క. అదేవిధంగా సావిత్రి, వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవిలాలా కలకాలం నిలిచిపోయే పాత్రలు చేసే అవకాశం నేటి తరం హీరోయిన్స్ కు రానున్న రోజులలో వస్తుందని తాను భావించడంలేదని అభిప్రాయ పడుతోంది బొమ్మాలి. ‘రుద్రమదేవి’ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తున్న అనుష్క నోటి వెంట తమ స్థితిని సీజనల్ ఫ్రూట్ గా పోల్చుకుంటూ మాటలు వచ్చాయి అంటే నేటితరం హీరోయిన్స్ మంచి పాత్రల కోసం ఎంత తపిస్తున్నారో అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: