ఎట్టకేలకు అఖిల్ తోలి సినిమా విషయంలో క్లారిటీ రావడమే కాకుండా ఆ సినిమా ప్రారంభం కుడా కావడంతో ఇప్పుడు ఆ సినిమాలో అఖిల్ పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరు అన్న విషయం పై అందరి ఆశక్తి పెరిగింది. శ్రీదేవి కుమార్తె జాహ్నవి దగ్గరనుంచి అలియా భట్, రాశి ఖన్నా, అవికా గోర్ ఇలా ఎన్నో హీరోయిన్స్ పేర్ల మధ్య ఈ చదరంగం జరిగింది.  అయితే ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు అఖిల్ పక్కన నటించబోయేది ఒక కొత్త అమ్మాయి అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అటు నాగార్జున ఇటు వినాయక్ ఒక నిర్ణయానికి రావడంతో ఇప్పుడు అఖిల్ హీరోయిన్ కు సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను మీడియా అఖిల్ దృష్టికి తీసుకు వెళితే అతడు ఖండించని నేపధ్యంలో అఖిల్ పక్కన కొత్తమ్మాయి ఎంపికకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది అని టాక్. ఈ ఆడిషన్స్ లో ఎంపిక ఫైనల్ కు వచ్చిన తరువాత నాగార్జున ఈ కొత్త అమ్మాయి ఎంపిక విషయంలో తన దృష్టిని పెట్టబోతున్నాడట.  ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అంతా సిద్ధం కావడంతో హీరోయిన్ ఎంపిక పూర్తి అయితే ఇక సినిమా షూటింగ్ ను పట్టాలు ఎక్కించడమే ఆలస్యం అని అంటున్నారు..     

మరింత సమాచారం తెలుసుకోండి: