పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలని ఏ మూవీ డైరెక్టర్ అయినా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు, ఆ బ్రాండ్ లైఫ్ టైం ఉండిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ మూవీలలో నటించటానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టి అందుకు అడ్డంకిగా మారింది. పవన్ కళ్యాణ్ స్థాపికంచిన జనసేన పార్టిని త్వరలోనే యాక్టివేట్ చేయబోతున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ మరింత బిజిగా మారబోతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గోపాల గోపాలమూవీకి సంబంధించిన షూటింగ్ పనులని పూర్తి చేశాడు. ఈ మూవీ అనంతరం గబ్బర్ సింగ్2 మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది. అనంతరం పవన్ కళ్యాణ్ ఏ మూవీలో నటిస్తాడు అనేది ఇంకా సన్సెన్స్ గానే కొనసాగుతుంది. ఎందుకంటే గబ్బర్ సింగ్2 మూవీ తరువాత పవన్ కళ్యాణ్ ఇక మూవీలకి గుడ్ భై చెప్పి పూర్తి రాజకీయ జీవితంగా అవతరించే అవకాశం ఉందని అంటున్నారు. తాను గబ్బర్ సింగ్2 తరువాత ఫిల్మ్ కెరీర్ ని ఆపేయాలని కోరుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకు నిదర్శనంగా, పవన్ తన వద్దకు వస్తున్న మరికొన్ని చిత్రాల కమిట్మెంట్స్ ని కూడ సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే 2016వ సంవత్సరం నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాడని అంటున్నారు. ఇదే గనుక జరిగితే రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు జరగటం ఖాయమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: