సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న స్టార్ యాక్టర్ తమన్న. ఇదిలా ఉంటే తమన్నకి సంబంధించిన రీసెంట్ పోస్టర్ ఒకటి సౌత్ మీడియలో హల్ చల్ చేస్తుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్న బాహుబలి మూవీలో తమన్నకి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ లుక్ లో తమన్న చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, తను మాత్రం చాలా స్లిమ్ గా కనిపించింది. గత చిత్రలలో కనిపించిన గ్లామరస్ లుక్స్ కంటే, బాహుబలి మూవీలో తమన్న ఫిజిక్ చాలా ఫర్ఫెక్ట్ గా ఉందని అంటున్నారు. అవంతిగా తమన్న, బాహుబలి మూవీలో కనిపిస్తుంది. ఇది హిస్టారికల్ రోల్ కాబట్టి తమన్న తన ఫిజిక్ కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇదే విషయంపై కోలీవుడ్ మీడియా ఓ విషయాన్ని బ్రేక్ చేసింది.తమన్న బాహుబలి మూవీ కోసం దాదాపు 8 కేజీల వెయిట్ లాస్ అయిందని అంటున్నారు. ఈ విషయంపై తమన్న సైతం పాజిటివ్ గా స్పందించింది. బాహుబలి మూవీ కోసం తమన్న స్పెషల్ తీసుకున్న స్పెషల్ కేర్ కారణంగా, తను బాహుబలి మూవీలో చాలా అందంగానూ, పాత్రకు తగ్గట్టుగానూ కనిపించిందని ఇండస్ట్రీ టాక్. బహుశ తను తీసుకున్న డైట్ కారణంగా, బాహుబలి మూవీలో తన చేసిన పాత్రకి కొంత వరకూ సరైన న్యాయం చేశానని అనిపిస్తుందని తమన్న కోలీవుడ్ మీడియాలో చెప్పినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా బాహుబలి మూవీ కోసం తమన్న 8 కేజీలు తగ్గి, రాజమౌళి కోరికను నిలబెట్టిందని అంటున్నారు. ఎందుకంటే తమన్నని దాదాపు 6 నుండి 8 కేజీల వరకూ తగ్గాలని, రాజమౌళి చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడంట. అలా తగ్గితేనే తన పాత్రకి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తానని చెప్పడంతో, తమన్న చేసేది లేక తన బరువుని తగ్గించుకుందని ఫిల్మ్ ఇండస్ట్రీ న్యూస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: