సంక్రాంతి పండుగకు జనవరి 14న విడుదల అవుతుంది అనుకున్న ‘గోపాల గోపాల’ తన రిలీజ్ డేట్ లో మార్పు చేసుకుని జనవరి 9కి రిలీజ్ కాబోతోంది. తెలుగు సినిమాలకు సంబంధించి భారీ సినిమాలు ఏవీ గోపాలుడితో పోటీగా రాలేకపోతు ఉండటంతో సంక్రాంతి హడావిడి అంతా గోపాలుడిదే కనిపించబోతోంది. దాదాపు వారం రోజుల పాటు టాక్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ కలెక్షన్స్ ను దుమ్ము దులపడం ఖాయం అని అంటున్నారు. అయితే గోపాలుడి ఈ వ్యూహాత్మక నిర్ణయం వెనుక శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ విజువల్ మూవీ 'ఐ' విడుదల తేదీ కారణం అని అంటున్నారు. ఎట్టకేలకు ఎన్నో సందిగ్ధాలు, సందేహాల మధ్య ఈ సినిమా రిలీజింగ్ డేట్ విషయంలో ‘ఐ’ మూవీ మేకర్స్ ఓ నిర్ణయానికొచ్చారు. ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 14న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. దీనితో విక్రమ్ సినిమా కన్నా ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చి సేఫర్ గేమ్ ఆడుతోంది గోపాలుడి యూనిట్. అయితే అటు ‘గోపాల గోపాల’ ఆడియో ఇటు విక్రమ్ ‘ఐ’ ఆడియోల ఫంక్షన్స్ మాత్రం ఈ నెల 30వ తేదీన పోటాపోటీగా ఒకేరోజు హైదరాబాద్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ వార్తల విషయం కూడా కేవలం గాసిప్పులుగానే మిగిలిపోతుందా లేకుంటే ఒకేరోజు రెండు భారీ సినిమాల ఆడియో వేడుకలకు హైదరాబాద్ కేంద్రం కానుందా అనే విషయం పై అతి త్వరలోనే క్లారిటీ రానున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: