సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు భారీ బడ్జెట్ మూవీలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి. గతంలో ఈ తరహా పోటీ వాతావరణంతో బడా నిర్మాతలు సైతం నష్టపోయారు. చాలా కాలం తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ తరహా పోటీ కొనసాగతుంది. విషయంలోకి వెళితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన మూవీ ఐ. కమర్షియల్ మూవీలకు చిరునామాగా ఉండే డైరెక్టర్ శంకర్, ఐ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఐ మూవీ సబ్జెట్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తి ని రేకెత్తిస్తుంది. దీంతో ఐ మూవీ కోసం కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. రెండు సంవత్సరాలుగా తెరకెక్కిన ఈ సుదీర్ఘ చిత్రాని 2015వ సంవత్సరం, సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు. 2015, జనవరి 9న శంకర్ భారీ బడ్జెట్ ఐ మూవీ రిలీజ్ అవుతుంది. దీంతో సినీ ప్రేక్షకులు క్యాలెండర్ లో ఆ రోజుని ఇప్పుడే రౌండ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే, అదే నెలలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరో భారీ బడ్జెట్ అండ్ క్రేజీ మూవీ రిలీజ్ అవుతుంది. అదే టాలీవుడ్ బడా మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల. అవును, మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ కలిసినటించిన గోపాల గోపాల మూవీ జవనరి 14న రిలీజ్ అవుతుదంటూ వచ్చిన టాక్స్, ఇప్పుడు మాట మార్చుబోతున్నాయి. గోపాల గోపాల మూవీ రిలీజ్ కొంచెం ముందుకు వచ్చి జనవరి 9నే రిలీజ్ అవుతుంది. దీంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు భారీ బడ్జెట్ మూవీ ఒకే రోజున రిలీజ్ కావడం అనేది సినీ ప్రేక్షకులకు పట్టరాని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఈ రెండు మూవీలలో ఏదైనా మూవీ వీక్ అంటూ మెదటి రోజే రిజల్ట్ బయటకు వస్తే మాత్రం, ఆ మూవీ ఘోర నష్టాలు తప్పవని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: