టాప్ హీరోయిన్ నయనతారకు చెన్నై ఎయిర్ పోర్టులో అనుకోని సమస్యలు ఎదురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. క్రిస్మస్ ను చాల ఆనందంగా జరుపుకోవాలని కేరళలోని తన సొంత ఊరుకు బయలు దేరిన నయనతారకు చెన్నై ఎయిర్ పోర్ట్ సిబ్బంది అనుకోని షాక్ ఇచ్చారు.  ఇక తెలుస్తున్న సమాచారం మేరకు నయనతార మొన్న హడావిడిగా తన సొంత ఊరు కొచ్చిన్ కు బయలుదేరింది. విమానం బయలుదేరడానికి ఒక అరగంట ముందుగానే 5 భారీ సూట్ కేసులతో విమానాశ్రయానికి చేరుకుంది. అయితే నయనతో ఉన్న ఆ 5 భారీ సూట్ కేసులను చూసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఒక్క సారిగా షాక్ అయ్యారట. దీనికి కారణం ఆ సూట్ కేసుల నిండా రకరకాల గిఫ్ట్స్. ఎంతో విలువైన ఆ గిఫ్ట్స్ ను చూసి షాక్ అయిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది అవన్నీ నయన కూడా తీసుకు వెళ్ళడం కుదరదని అవన్నీ చెక్ చేసి పంపాలని అదీ కాకుండా చెకింగ్ టైం కూడా పూర్తి అయిపోయిందని చెప్పడంతో ఏమి చేయలేని నయన తార అ గిఫ్ట్స్ ను తన కారులో తన ఇంటికి పంపించి వేసి కేవలం తన హ్యాండ్ బ్యాగ్ తో మాత్రమే ఫ్లైట్ ఎక్కింది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఎంతో సరదాగా తన కుటుంబ సభ్యులతో క్రిస్మస్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న నయన్ ఆశల పై చెన్నై ఎయిర్ పోర్ట్ ఈ విధంగా నీళ్ళు జల్లిoది అని అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: