ముకుంద’ సినిమాకు అనుకున్నంత భారీ విజయం దక్కకపోయినా ఆ సినిమా విజయవంతం అయింది అన్నట్లుగా సక్సస్ టూర్ లో నిన్న భాగ్యనగరంలోని అనేక ధియేటర్ల చుట్టూ తిరిగేసాడు వరుణ్ తేజ్. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించిన అనేక విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పై కొన్ని ఆ శక్తికర కామెంట్స్ చేసాడు ఈ మెగా ప్రిన్స్. సాధారణంగా మొదటి సినిమా అంటే హీరోని చాలా అల్లరి వాడిగా మాసిగా చూపిస్తారనుకుంటే, ఇలా ఇంత డీసెంట్‌గా సీరియస్‌గా వెండి తెర పై కనిపించారేమిటి అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ వరుణ్ తేజ్ ఇటువంటి సీన్స్ కొన్ని పెట్టమని తాను ఎన్ని సార్లు కోరినా దర్శకుడు శ్రీకాంత్ తన మాట వినలేదని ఆయన ఆలోచన ప్రకారం ఈ సినిమాలోని హీరో చాల సీరియస్ గా ఉంటాడని అందువల్ల అటువంటి సీన్స్ ఊహించుకో వద్దని ముందుగానే తనకు చెప్పాడని అందువల్ల నేటి తరం యూత్ కు నచ్చే మసాలా సన్నివేశాలు ఈ సినిమాలో తగ్గాయి అని అభిప్రాయ పడుతూ కొత్త హీరోను కదా దర్శకుడుని ప్రభావితం చేయలేను అంటూ శ్రీకాంత్ అడ్డాల పై సెటైర్లు వేసాడు వరుణ్ తేజ్.  అయితే నిజజీవితంలో తాను చాల బాగా సెటైర్లు వేస్తానని తన సన్నిహితులు అంతా అంటారని అందువల్ల తన టాలెంట్ నిరూపించుకునే మరో సినిమాలో ఈ మాస్ ఐటమ్స్ అన్నీ చేస్తాననీ ‘ముకుంద’ ను మాత్రం ఆ కోణంలో చూడకుండా ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమాగా చూడాలి అంటూ మెగా అభిమానులను మీడియా ద్వారా అభ్యర్ధించాడు వరుణ్ తేజ్. నితిన్ ‘చిన్న దానా నీకోసం’ సినిమాతో పోల్చుకుంటే ముకుందకు మంచి మార్కులు పడుతుండటంతో సంక్రాంతి వరకు అయినా ఈ సినిమా కలెక్షన్స్ పడిపోకుండా నిలబడగలిగితే ప్రస్తుత పరిస్థుతులలో వరుణ్ తేజ్ మొదటి ప్రయత్నం సూపర్ సక్సస్ అయింది అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: