కొన్నిసంత్సరాల పాటు కొనసాగిన వరస పరాజయాల తరువాత ‘ఇష్క్’ సినిమా విజయవంతం కావడంతో ఊపిరి తీసుకున్న నితిన్ ఆ తరువాత నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో నితిన్‌ మళ్ళీ టాప్ యంగ్ హీరోల రేసులోకి వచ్చాడు అనుకున్నారు అంతా. అయితే మరి కొద్దిరోజులలో ముగిసి పోతున్న 2014 లో రెండు సినిమాలను విడుదల చేసినా నితిన్ ఆశించిన హిట్స్ ఆరెండు సినిమాలు అందించలేకపోయాయి.  సంవత్సర ప్రారంభంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ ఒక మోస్తరు విజయంగా మిగలడంతో తన ‘చిన్న దానా నీకోసం’ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. నితిన్ హీరోగా నటించిన ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ ఇంచుమించు పూర్తి అయిపోయినా ‘చిన్న దానా నీకోసం’ విడుదల తరువాత ఆ సినిమాను విడుదల చేద్దాం అనుకున్నాడు నితిన్.  ‘చిన్నదాన నీకోసం’ హిట్టయ్యి ఉంటే ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ కు వెంటనే మోక్షం లభించేది. 2015 ప్రథమార్థంలోనే ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ వచ్చేస్తుందని ‘చిన్నదాన నీకోసం’ ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో చెబుతూ వచ్చాడు నితిన్‌. అయితే ఇప్పుడు నితిన్ లేటెస్ట్ సినిమా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకావడంతో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ పరిస్థితి ఏమిటి అనే మాటలు వినిపిస్తున్నాయి.  గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫిలింనగర్ లో నెగిటివ్ టాక్ ఉండటంతో ఈసినిమా మార్కెట్ అవడంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇంతలో నితిన్ నటించిన ‘చిన్నదాన నీకోసం’ విడుదల అయినా నితిన్‌ క్రేజ్ ఏ మాత్రం పెరగని నేపధ్యంలో ఈ ఫ్లాప్ ల హంగామా పరిస్థుతుల మధ్య ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ వస్తుందా? అది రాకుంటే 2015 లో నితిన్ పరిస్థితి ఏమిటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: