ఈ సంవత్సరం విడుదలైన టాప్ హీరోల సినిమాలు 50 రోజులు ఆడటమే రికార్డుగా మారిపోయిన పరిస్థుతులలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ 275 రోజుల విజయోత్సవాన్ని జరుపుకుని బాలకృష్ణ అభిమానులకు జోష్ ను కలిగించడమే కాకుండా టాలీవుడ్ లో ఒకనాటి టాప్ హీరోల సినిమాల సూపర్ సక్సస్ ను గుర్తుకు చేసింది.  నిన్న సాయంత్రం ప్రొద్దుటూరులో ‘లెజెండ్’ సినిమా ఏకధాటిగా 275 రోజులు ప్రదర్శింప బడ్డ సందర్బాన్ని పురస్కరించుకుని ‘లెజెండ్’ విజయోత్సవ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అంతా బాలయ్య కటౌట్లతో నిండిపోయింది. ఈ సందర్భంగా బాలకృష్ణ తన అభిమానులను చూసి ఉద్వేగంగా మాట్లాడుతూ హుద్ హుద్ బాధితుల విషయంలో తన అభిమానులు స్పందించిన తీరును తన జీవితంలో మరచిపోలేను అని అంటూ ఇలాంటి అభిమానులున్నందుకు గర్వపడుతున్నాను అన్నాడు బలయ్యా. ఈ సందర్భంలో మరింత ఉద్వేగపడుతూ ఈ సినిమా ఘన విజయంతో తన ‘మంగమ్మగారి మనవడు’ ఘన విజయం రోజులు గుర్తుకు వస్తున్నాయని ఇక నుంచి తన అభిమానులు కోరుకునే సినిమాలలో నటిస్తాను అన్నాడు బాలయ్య. ఇక ఈసినిమా దర్శకుడు బాలయ్యను ఆకాశానికి ఎత్తేస్తూ బాలకృష్ణ అంటేనే ‘రాయల్’ అనే పదానికి చిరునామాగా కనిపిస్తాడని మళ్ళీ ఖచ్చితంగా బాలయ్యతో మరో సూపర్ హిట్ చేస్తానని మాట ఇచ్చాడు బోయపాటి. ఆడియో వేడుకల ఫంక్షన్స్ తప్ప ఒక సినిమా శతదినోత్సవ సభలు జరగని నేటి వర్తమాన కాలంలో ‘లెజెండ్’ 275 రోజుల వేడుక టాలీవుడ్ పరిశ్రమకు మంచి జోష్ ను ఇస్తుంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: