మరి కొద్దిరోజులలో ముగిసి పోతున్న 2014 ప్రణితకు ఏ విధంగాను కలిసి రాకపోయినా ఈ సంవత్సరం ముగింపులో మాత్రం ప్రణితకు మంచు విష్ణు రూపంలో అదృష్టం తలుపు తట్టింది అనే వార్తలు వినపడుతున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్ తరువాత ప్రణిత నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రభస’ లాంటి భారీ సినిమాలలో నటించినా ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్ లో ప్రణిత కెరియర్ ముగిసి పోయింది అనుకున్నారు అంతా.  ఈమధ్య నాగార్జున పక్కన ప్రణిత నటిస్తుంది అని వార్తలు వచ్చినా అవి నిజంకాలేదు. దీనితో బెంగపడిన ప్రణితకు ఊహించని బహుమానం ఇచ్చాడు మంచు విష్ణు. ఈ మంచు వారి అబ్బాయి హీరోగా దేవకట్టా ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్టయిన ‘అరిమ నంబి’ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటించడానికి రకరకాల హీరోయిన్స్ పేర్లను పరిశీలించిన మంచు విష్ణు చివరకి బాపు బొమ్మ ప్రణితను ఎంపిక చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ తమ పారితోషికాల విషయంలో ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణుకు చుక్కలు చూపెట్టడంతో తిరిగి యూటర్న్ తీసుకుని విష్ణు ప్రణిత వైపు మొగ్గుచూపాడు అనే వార్తలు ఉన్నాయి. ఏమైనా ఈ సంవత్సరం వెళ్ళిపోతూ ప్రణితకు మంచి గిఫ్ట్ ఇచ్చింది అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: