నాగార్జున ఏమిచేసినా చాలా ప్లాన్డ్ గా వ్యూహాత్మకంగా చేస్తాడు అనే పేరు ఉంది. అఖిల్ సినిమా విషయంలో కూడా ఆ సినిమాకు క్రేజ్ తీసుకు రావడానికి నాగ్ దగ్గర ఉండే క్రియేటివ్ టీమ్ చూపిన అత్యుత్సాహనికి నాగార్జునకు అనుకోని సమస్య ఎదురైంది అనే గాసిప్పులు వినపడుతున్నాయి. అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ప్రారంభమైన అఖిల్ మొట్టమొదటి సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి స్పీడ్ గా జరగబోతోంది.  త్వరలో ప్రారంభంకాబోతున్న ఈసినిమాకు సంబంధించి వెబ్ మీడియాలో మరింత క్రేజ్ తీసుకు వచ్చే నేపద్యంలో నాగ్ దగ్గర ఇంటర్‌నెట్‌ ప్రచారాన్ని నిర్వహించే టీమ్ అఖిల్‌ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చేట్లుగా చేసారట. అసలు ఈన్యూస్ లీకింగ్ నాగార్జున దగ్గర ఉండే టీమ్ నుండి కొన్ని వెబ్ సైట్లకు లీక్ అయింది అనే వార్తలు ఉన్నాయి. అయితే ఇంతవరకు ఎటువంటి ప్రస్తావనా లేని విషయాన్ని గాసిప్ గా మార్చి వెబ్ మీడియాలో హడావిడి జరిగిన తీరుకు పవన్ కొద్దిగా అసహనం వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. అదీకాకుండా వెబ్ మీడియాలో వచ్చిన ఈవార్తలకు ఈ సినిమాను నిర్మిస్తున్న దర్శక నిర్మాతల నుండి ఎటువంటి ఖండనా రాకపోవడం పవన్ కు అసౌకర్యంగా మారిందని టాక్.  నాగార్జున ప్రేమేయం లేకుండా నాగ్ దగ్గర ఉండే టీమ్ అఖిల్ సినిమా ప్రమోషన్ విషయంలో చూపిన అత్యుత్సాహం అనుకోని సమస్యగా మారడంతో ఈ విషయం పై నాగార్జున నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: