కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక ఫోటో వెబ్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఈ సినిమాలో చాల సీరియస్ గా దేవుడి గుడిలో మహేష్ బాబు ప్రశ్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. అయితే ఈ సీన్ ఈ సినిమా కథకు సంబంధించింది అని అందరికీ తెలిసినా తనకు గత సంవత్సరం ఎంతో కష్టపడినా ఎందుకు హిట్స్ రాలేదు అని ఏకంగా దేవుడినే మహేష్ బాబు టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ ఫోటో చూసిన వారికి అభిప్రాయం ఏర్పడటం సహజం. ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను మేడే నాడు విడుదల చేయాలని మహేష్ పట్టుదలతో ఉన్నట్లు టాక్. మొన్నటి దాకా ఈసినిమా ఫస్ట్ లుక్ ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అని ప్రచారం జరిగినా లేటెస్ట్ గా ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరిలో రాబోతున్న మహాశివరాత్రి రోజున విడుదల చేస్తారు అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఒక పారిశ్రామిక వేత్త కొడుకుగా మహేష్ బాబు ఈసినిమాలో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ కొత్త సంవత్సరంలో మహేష్ బాబుకు శివుడు సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి: