టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి పెద్ద మల్టీస్టారర్ మూవీగా 2015లో రిలీజ్ అయిన చిత్రం గోపాల గోపాల. అయితే గోపాల గోపాల మూవీ బాక్సాపీస్ వద్ద గుడ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా అనుకున్న రిపోర్ట్స్ ని చేరుకోలేకపోతుంది. ఈ మూవీ రిలీజ్ అయి పది రోజులు గడుస్తున్నప్పటి, ఇప్పటి వరకూ కేవలం 40 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని మాత్రమే సాధించగలిగింది. అయితే కొన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ కి ఇంకా పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో, వారిలో కొంత టెన్షన్ క్రియేట్ అవుతుంది. నైజాంలోని డిస్ట్రిబ్యూటర్స్ రీసెంట్ గా సేఫ్ జోన్ లోకి వెళ్ళటంతో వీరికి కొంత ఊరట లభించింది. అలాగే తాజాగా క్రిష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ కూడ సేఫ్ జోన్ లోకి వెళ్ళారు. ఆంధ్రలోని మిగతా ఏరియాల్లో మాత్రం ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోవడంతో వీళ్ళళ్ళో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఏదైనా మూవీకి కేవలం 10 రోజుల్లోనే భారీగా కలెక్షన్స్ వస్తాయి. తరువాత కలెక్షన్స్ ని రాబట్టుకోవటానికి చాలా సమయం పడుతుంది. మూవీకి గుడ్ టాక్ ఉన్నప్పటికీ, చాలా మంది ధియోటర్ వద్దకు రావటానికి ఆసక్తి చూపించటం లేదు. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఐ మూవీ, తెలుగులో ఘోరంగా డిజాస్టర్ కావడంతో, ఓ రకంగా గోపాల గోపాల మూవీకి ఇది ప్లస్ అయింది. లేకుంటే గోపాల గోపాల కూడ భారీ నష్టాల్ని చవిచూసేదని అంటున్నారు. మొత్తంగా పది రోజుల్లో 80 కోట్ల మార్క్ ని చేరుకుందంటూ వేసిన లెక్కలు, గోపాల గోపాల విషయంలో కుదరదలనే తెలుస్తుంది తాజా రిపోర్ట్స్ ప్రకారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: