టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన అరవ చిత్రం ఐ. ఐ మూవీ తెలుగులో సత్తా చాటుతుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. కాని రిలీజ్ అనంతరం ఈ మూవీలో కథే లోపం అంటూ అందరూ శంకర్ పై కామెంట్ చేస్తున్నారు. శంకర్ నుండి రావాల్సిన సబ్జెక్ట్ కాదది అంటూ, ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయంగా చెబుతున్నారు. అయితే తెలుగులో ఐ మూవీ బాక్సాపీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. తమిళంలో ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించిన ఐ సినిమాను మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఈ మూవీ తెలుగు హక్కుల కోసం సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ఖర్చు పెట్టింది అలాగే ప్రమోషన్ కోసం దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు చేసింది. ఎంత ఖర్చు పెటినా, మొదటి రెండు వారాల్లో ఆ మనీ అంతా తిరిగి రావడం ఖాయం అనే లెక్కలు వేసుకున్నారు. మొత్తంగా ఈ చిత్రం నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా మంచి రిజెల్ట్ నే తెచ్చుకుంది. తొలివారం కలెక్షన్స్ లో రికార్డుని క్రియేట్ చేసింది. డబ్బింగ్ చిత్రాల్లో రోబో చిత్రమే...రెవిన్యూ పరంగా టాప్ ప్లేస్ లో ఉండగా..ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. మొదటి వారంలో తెలుగు వెర్షన్ ఐ మవీ సాధిందించిన కలెక్షన్స్ ఏరియావైజ్ గా ఓ సారి చూద్దాం. ఏరియా...కలెక్షన్స్ నైజాం: Rs 7.90 కోట్లు సీడెడ్: Rs 4.72 కోట్లు ఉత్తరాంధ్ర: Rs 2.25 కోట్లు గుంటూరు: Rs 2.15 కోట్లు కృష్ణా: Rs 1.44 కోట్లు తూర్పు గోదావరి: Rs 1.86 కోట్లు పశ్చిమ గోదావరి: Rs 1.67 కోట్లు నెల్లూరు: Rs 1.11 కోట్లు ఎపి &నైజాం కలిసి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: Rs 23.10 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: