కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రతారగా దశాబ్ధకాలం పాటు కొనసాగిన స్టార్ హీరోయిన్ త్రిష. త్రిష హీరోయిన్ గా చేసిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడమే కాకుండా, ఎన్నో రికార్డ్స్ ని కూడ సొంతం చేసుకున్నాయి. దాదాపు చాలా మంది సీనియర్ యాక్టర్స్ తో త్రిష నటించింది. ఇదిలా ఉంటే ఎట్టకేలకు త్రిష పెళ్ళి చేసుకుంటుందనే విషయం తెలిసిందే. తన చిరకాల స్నేహితుడు వరుణ్ మణియన్ తో వివాహానికి చెన్నై సుందరి త్రిష రెడీ అవుతుంది. వరుణ్ సంపన్నుల కుటుంబానికి చెందిన అబ్బాయి కావడంతో త్రిషకు ఖరీదైన కానుకలు ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పిటికే రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కానుక త్రిషకు బహుకరించాడు. దీని తరవాత మరో ప్రత్యేక కానుకను అందించాడు. త్రిషకు మూగ జీవాలు అంటే చాలా ఇష్టం కాబట్టి, నిరాశ్రయులైన మూగ జీవాలకు ఆహారం, వైద్యం, షెల్టర్ అందించాలని వరుణ్ నిర్ణయం తీసుకున్నారు. వరుణ్ నిర్ణయంతో త్రిష ఫుల్ హ్యాపీగా ఉందట. త్రిష కోసం వరుణ్ ఇన్ని పనులు చేస్తుంటే, మరి త్రిష ఏం చేస్తుంది. అవును త్రిష వరుణ్ కోసం ఏమి చేయకపోయినా, త్రిష మాత్రం కాబోయే భర్తకి భారీ కండిషన్స్ పెట్టింది. పెళ్లి జరిగిపోయిన తరవాత నుండి తన వ్యక్తిగత ఫిల్మ్ కెరీర్ గురించి ఎటువంటి విషయాలను అడగకూడదంట. అలాగే పెళ్ళి తరువాత మూవీలలో నటిస్తాను అంటే నో చెప్పకూడదట. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే తను ఏ మూవీలో, ఏ హీరో సరసన నటిస్తాను అనే విషయంలో పూర్తి స్వేచ్ఛ త్రిషదే నని ముందుగానే వరుణ్ కి చెప్పుకొచ్చింది. ఇవ్వన్ని ఒప్పుకున్న తరువాత వరుణ్ తో త్రిష పెళ్లికి సిద్ధపడిందని కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: