సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన గ్లామర్ తో అవకాశాలను సొంతం చేసుకుంటున్న బ్యూటీ రకుల్ ఫ్రీత్ సింగ్. గత కొంత కాలంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ లో, రకుల్ ఫిల్మ్ కెరీర్ గ్రాఫ్ టెంపో పెరుగుతూ వస్తుంది. తను నటించిన వరుస చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉండగా, తను మరో చిత్రాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడం, అలాగే కాళీ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొనడం జరుగుతుంది. తను నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ నుండి రకుల్ కి తెలుగులో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తమిళంలో కూడ ఆఫర్స్ వస్తున్నప్పటికీ, తెలుగులో వరుస కమిట్మెంట్స్ కారణంగా కోలీవుడ్ లో నటించలేకపోతుంది. ఇదిలా ఉంటే, తనకి తెలుగులో వరుస ఆపర్స్ రావటానికి కారణం ఎవరు? అనేదానిపై ఫిల్మ్ నగర్ లో ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన బడా హీరో, రకుల్ ప్రీత్ సింగ్ కి వరుస ఆఫర్స్ ఇప్పిస్తున్నాడని తెలుస్తుంది. తన సర్కిల్ లోని హీరోల మూవీలలో రకుల్ కి హీరోయిన్ ఆఫర్ కావాలని డిమాండ్ చేయడంతో, మిగతా హీరోలు కూడ చేసేదేమి లేక, రకుల్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఆ విధంగానే లౌక్యం, రఫ్, కరెంట్ తీగ మూవీలలో తను హీరోయిన్ గా సెలక్ట్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కి చెందిన ఆ హీరోతో, రకుల్ ప్రీత్ సింగ్ ఎపైర్ ని కంటిన్యూ చేస్తుందనే టాక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. గతంలోనూ రకుల్ పై ఈ తరహా కామెంట్స్ వచ్చినా, తన నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే కొంత మంది మాత్రం, రకుల్ ఫ్రీత్ సింగ్ ఫాంలో ఉంది కాబట్టి, ఇటువంటి గాసిప్స్ పుట్టడం చాలా కామన్ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: