ఇప్పటిదాకా హీరోలంతా హీరోయిన్స్ బుగ్గల పైనో, పెదాల పైనో, బొడ్డు పైనో ముద్దు పెట్టుకునే సన్నివేశాలను సినిమాలలో చూశాం. అయితే కోలీవుడ్ హీరో ధనుష్ మరొక ముందడుగు వేసి ఈ ముద్దుల సీన్స్ లో మరో కొత్త అధ్యాయానికి తెర తీసాడు. ధనుష్ ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘షమితాబ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో అక్షరహాసన్ చాల గ్లామర్ గా కనిపించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాలలో తన అక్క శ్రుతిని మించి రెచ్చి పోయింది అని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో ధనుష్ హీరోయిన్ అక్షర హాసన్‌ను ముద్దాడిన సన్నివేశం హాట్ టాపిక్ మారింది.

ఈ సినిమా ట్రైలర్ లో హీరోయిన్ అక్షర హాసన్, ధనుష్ వైపు చూస్తూ ‘కిస్ మై ఆస్ మంకీ' అంటుంది. దీనితో వెంటనే ధనుష్ ఆమె పిరుదులపై ముద్దు పెడతాడు. దీనిని బట్టి ఈ సినిమాలో అక్షర హాసన్ రెచ్చి పోయింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ ముద్దుల సీన్ ఉన్న టీజర్ ను చూసిన వారంతా మంచి జోష్ లో ఉంటూ మరొకరికి ఈ టీజర్ లింక్ ను షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా హిట్ గ్యారెంటీ అని కూడా అంటున్నారు.

ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పిన సంగతి తెలిసిందే. ఈపాట ఇప్పటికే బాలీవుడ్ లో హిట్ సాంగ్ గా మారింది. ఇప్పటికే తాను నటించిన ‘రంఝానా' సినిమాతో హిట్ కొట్టిన ధనుష్ ఈ రెండవ సినిమాతో కూడా బాలీవుడ్ లో ఇదే హవా కొనసాగిస్తాడు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: