అల్లుఅర్జున్ అల్లుఅరవింద్ కొడుకుగానే అందరు అనుకుంటారు. అలాంటి బన్నీ సత్యమూర్తి కొడుకుగా మారిపోయాడు అంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి ఊపు అందుకుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రానికి ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ అనే టైటిల్‌ ఖరారైంది అనే గాసిప్పుల హడావిడి జరుగుతోంది.

‘జులాయి’ తరువాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాకు బయ్యర్లలో మంచి క్రేజ్ ఏర్పడి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడం ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో బన్నీ రొమాన్స్ చేస్తూ ఉండటం ఈ సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ ను తెచ్చి పెడుతోంది.

ఈ కారణాలతోనే ఈ సినిమా అల్లు అర్జున్‌ చిత్రాల్లోనే విడుదలకి ముందు అత్యధిక బిజినెస్‌ చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ముందుగా ఈ సినిమాకు ‘హుషారు’, ‘త్రిశూలం’, ‘జాదూగర్‌’ లాంటి టైటిల్స్‌ ను పరిశీలించినా అనుకోకుండా తెర పైకి వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ టైటిల్ కు ఈ సినిమా యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా ఓటు వేసారు అని టాక్.

ఈ సినిమాలో సత్యమూర్తి కొడుకుగా కనిపించే బన్నీ తన తండ్రి ఆర్ధికంగా వ్యాపారంలో అంతా పోగొట్టుకున్న తరువాత బన్నీ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపనీకి ఓనర్ గా మారి తన మరదళ్ళు సమంత, అదా శర్మ, నిత్యా మీనన్‌ లను ఆట పట్టిస్తూ అటు మాస్ నీ ఇటు క్లాస్ నీ ఆకట్టుకునే కథతో నిర్మించిన ఈ సినిమా గ్యారంటీ హిట్ అనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: