టాలీవుడ్ ఎంపరర్ గా మారిపోయి మూడు సార్లు 40 కోట్ల క్లబ్ లో నిలిచిన సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ ను కూడా ఒక్క ఫ్లాప్ సినిమా భయాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి అంటే మన టాప్ హీరోలు ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఎంత భయ పడతారో అర్ధం అవుతుంది. ఈమధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన ‘జానీ’ సినిమా పై చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి.

పవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారిపోవడంతో తాను ఎంత మానసిక వ్యథ అనుభవించానొ ఆ ఇంటర్వ్యూలో వివరించాడు పవన్. తనను ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత చాలామంది తాను ఎదో తప్పు చేసినట్లుగా ఒక నేరస్థుడుని చూసినట్లుగా చూసారని. అందుకే తాను జయాపజయాల్ని ఎప్పుడూ పట్టించుకోను అంటూ కామెంట్ చేసాడు పవన్.

సాధ్యమనంత వరకు జయాపజయాలకు అతీతంగా ఉండటానికి తాను ప్రయత్నిస్తాను అని చెపుతూ సినిమా హిట్టయితే అందలం ఎక్కిస్తారు. ప్లాపయితే తిడతారు కాబట్టి తనకు ‘జానీ' సినిమా చాలా పాఠాలు నేర్పింది అని అన్నాడు. దీనిని బట్టి చూస్తే తెలుస్తుంది పవన్ ను ఇప్పటికీ ‘జానీ’ ఫ్లాప్ భయాలు ఎంతగా వెంటాడుతున్నాయో.

ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సర్జరీకి వెళ్ళబోతున్నాడు అని ఇప్పటి వరకు వచ్చిన వార్తలు నిరాధారం అని పవన్ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని పవన్ సన్నిహితులు ఇచ్చిన వివరణను ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ప్రముఖంగా ప్రచురించడంతో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ ఇక అన్ని విధాల రెడీ అయినట్లే అనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: