శ్రీనువైట్ల బ్రహ్మానందంను తన సినిమాలలో వాడుకున్నంతగా మరే దర్శకుడు బ్రహ్మి నుండి కామెడీ పిమ్డుకోలేదు అన్నది వాస్తవం. శ్రీనువైట్ల సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా మారిన ‘దూకుడు’ లోని బ్రహ్మిపాత్రను బుల్లితెర పై చూస్తూ ఇప్పటికీ చాలామంది నవ్వుకుంటూనే ఉంటారు.

అటువంటి వీరి సూపర్ హిట్ కాంబినేషన్ ఇక ముగింపుకు వచ్చినట్లే అనే వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. వెంకీ నుండి డీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్‌షా, ఆగడు వరకు బ్రహ్మి లేకుండా సినిమాలు తీయని శ్రీను వైట్ల మొట్టమొదటి సారిగా బ్రహ్మి లేకుండా తన లేటెస్ట్ సినిమాలో ఒక ప్రయోగం చేయబోతున్నాడు అని టాక్.

రామ్ చరణ్ తో శ్రీనువైట్ల తీయబోతున్న లేటెస్ట్ సినిమాలో బ్రహ్మానందం బదులు కోలీవుడ్ టాప్ కమెడియన్ సంతానంను ఈ సినిమాలో తీసుకుంటున్నారు అనే వార్తలు హడావిడి వినిపిస్తోంది. ఒక వెరైటీ కామెడీ ట్రాక్ క్రియేట్ చేయడం కోసం శ్రీనువైట్ల దృష్టి సంతానం వైపు మళ్ళింది అని అంటున్నారు.

ఈ నెల 27న ప్రారంభం కాబోతున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి పట్టాలు ఎక్కుతున్న నేపధ్యంలో సంతానం ఎంపికకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల అవుతుంది అని అంటున్నారు. మరి శ్రీనువైట్ల ప్రయోగం ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: