జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘టెంపర్’ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు రావడంతో ఆ వార్తను విన్న యంగ్ టైగర్ అభిమానులు విపరీతంగా బాధ పడుతున్నారు అని టాక్. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ టెంపర్ ఆడియో వేడుక రిపబ్లిక్ డే నాడు జరుగుతుంది అని వార్తలు రావడంతో జాతీయ పండుగను జూనియర్ అభిమానులు తమ పండుగగా భావించాలని అనుకున్నారు.

అయితే మళ్ళీ ఈ సినిమా ఆడియో వేడుక జనవరి 31కు వాయిదా పడింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు మరో ట్విస్ట్ ఇస్తూ అసలు ఆడియో వేడుక జరపకుండానే ఈ సినిమా పాటలను డైరెక్ట్ గా మార్కెట్లోకి వదిలేస్తారు అని వార్తలు రావడం జూనియర్ అభిమానులను మరింత కలవర పెడుతోంది అని అంటున్నారు.

సినిమాల మధ్య పోటీ ఎక్కువైన నేటి పరిస్థుతులలో జూనియర్ నిర్మాతలు తాము తీస్తున్న సినిమాల విషయంలో ఎందుకు ఇటువంటి అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనే బాధ కూడా జూనియర్ అభిమానులను వెంటాడుతోంది అని అంటున్నారు. గత సంవత్సరం విడుదలైన ‘రభస’ సినిమా విషయంలో ఇదే జరిగింది.

ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆ సినిమా పబ్లిసిటీ విషయంలో తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది అని జూనియర్ అభిమానులు వాదిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ‘టెంపర్’ ఆడియో విషయంలో క్షణక్షణం మారిపోతున్న వార్తలు జూనియర్ అభిమానులకు టార్చర్ గా మారింది అని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: