తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన హ్యుమరిజం ఏర్పరచుకొన్న ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. ఆనారోగ్యంతో మాదాపూర్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. అయితే ఆయనకు కొద్ది రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

తెలుగు సినీ అభిమానులకు ఎమ్మెస్ నారాయణగా మైలవరపు సూర్యనారాయణ ఏప్రిల్ 16, 1951లో పశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రులో జన్మించారు. ఆయనకు భార్య కళాప్రపూర్ణ, కుమారుడు విక్రమ్, కుమార్తె శశికిరణ్ ఉన్నారు. ఎమ్మెస్ నారాయణ సుమారు 700 సినిమాల్లో నటించినారు. ఆయనకు ప్రతిష్టాత్మక నంది అవార్డును అయిదుసార్లు వచ్చింది. చివరగా ఆయనుకు 'దూకుడు' సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. ఆయన నటించిన పటాస్ మూవి నేడే రిలీజ్ కావడం అందులో ఆయన పండించిన హాస్యం అందరినీ నవ్వించినప్పటికి ఆయన మరణం కంటతడి పెట్టిస్తుంది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎమ్మెస్ లెక్చరర్‌గా జీవితం ప్రారంభించి సినిమాలపై మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. లింగబాబు లవ్‌స్టోరితో ఆయన సినీ జీవితం ప్రారంభమైంది.తాజాగా ఎమ్మెస్ నటించిన పటాస్, రేయ్, శంకర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మానాన్నకు పెళ్లి, రామ్‌సక్కనోడు, సరదాకు పోదాం రండి, శివమణి, దూకుడు సినామాలకు ఉత్తమ హస్యనటుడిగా ఎమ్మెస్ నంది అవార్డులందుకున్నాడు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: