టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న న్యూ బ్రాండ్ డైరెక్టర్ మారుతి. తక్కువ కాలంలోనే మారుతి తనదైన మూవీలతో, బాక్సాపీస్ వద్ద మినిమం మార్కెట్ ని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే అల్లుశిరీష్, మారుతి కాంబినేషన్ లో వచ్చిన కొత్తజంట మూవీ అనంతరం, మారుతికి మెగా హీరోల నుండి వరుస అవకాశాలు వచ్చాయి. అంతే కాకుండా బడా హీరోలు సైతం మారుతికి మూవీలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. విక్టరి వెంకటేష్ తో ఓ మూవీ, అల్లు అర్జున్ తో ఓ మూవీ, అలాగే పవన్ కళ్యాణ్ తో స్టోరి డిస్కషన్స్, నాగార్జునతో ఓ మూవీ కమిట్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే, మారుతి మరో నాలుగు సంవత్సరాలు బిజి షెడ్యూల్స్ లో ప్యాక్ అయిపోయాడు. ఇదంతా కళ్ళముందు జరిగిపోతుంటే, ఒక్కసారిగా ఏమైందో తెలియదు కాని, అన్ని ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పటి వరకూ మారుతి అంటే ఆసక్తి చూపించిన హీరోలు సైతం, తన డైరెక్షన్ లో నటించకుడని నిర్ణయించుకున్నారు. ఇక మెగా హీరోలు అయితే మారుతిని దగ్గరకు రానివ్వలేదని కూడ ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మొత్తం విషయంలో మారుతి ఎక్కడో బిగ్ మిస్టేక్ చేశాడని అంటున్నారు. దాన్ని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతానికి మారుతి, నానితో ఓ మూవీ తీస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో నాని హీరోగా యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 5 నుండి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మెగా హీరోలు మారుతిని పక్కన పెడితే, అల్లుఅరవింద్ మాత్రం మారుతి,నాని కాంబినేషన్ మూవీకి నిర్మాతగా ఉండటమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: