పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూవీలకి సంబంధించిన డిస్కషన్స్ తో బిజిగా మారిపోయాడు. తను తాజాగా నటించిన గోపాల గోపాల మూవీ బాక్సాపీస్ వద్ద దుమ్మురేపుతుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన గోపాల గోపాల మూవీ, కేవలం వారం రోజుల్లోనే 48 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్స్ ని కొల్లగొట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ని సంతోషాన్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులు నిరాశ చెందుతున్నారని అన్ని చోట్ల నుండి క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ మూవీలకి సంబంధించిన విషయం కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఎప్పుడు వేగవంతంగా పనిచేస్తుంది? అలాగే పవన్ రాజకీయంగా ఎప్పుడు క్రియాశీలకంగా పనిచేస్తాడు? అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు ఒకవైపు ఇలా ఆలోచిస్తుంటో, మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం తన అప్ కమింగ్ మూవీలకి సంబంధించిన కథలకి డైరెక్టర్స్ ని సెలక్ట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తను నటించాల్సిన గబ్బర్ సింగ్2 మూవీ పెండింగ్ లో ఉండగా, మరోసారి గోపాల గోపాల డైరెక్టర్ తో ఓ మూవీని చేస్తాను అంటూ కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ రెండు మూవీలే కాకుండా పి.వి.పి బ్యానర్ లో మరో మూవీని చేయటానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు. ఈ మూడు మూవీలు మొత్తం పూర్తై, ఒకదాని తరువాత మరొకటి రిలీజ్ కావాటానినే దాదాపు 3 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ లోపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పడు పవన్ కళ్యాణ్ వచ్చి హడావిడి చేస్తే, ఈసారి దానిని ప్రజలు ఎంత వరకు విశ్శసిస్తారు అనేది పవన్ అభిమానుల అవేధనగా కనిపిస్తుంది. ఇకనైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేస్తే మంచిదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: