భాగ్యనగరంలోని ఒక పబ్ లో తెలుగుతెర సీతమ్మ అంజలి హంగామా చేసి రచ్చ క్రియేట్ చేసిందని వెబ్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఈ షాకింగ్ న్యూస్ మాత్రం అంజలి అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది.

వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అంజలి నిన్న తన స్నేహితులతో కలిసి ఒక ప్రముఖ పబ్ కు వచ్చి తెగ హంగామా చేస్తూ డాన్స్ ఫ్లోర్ వద్దకు వెళ్లేందుకు సిద్దమైందని వార్తలు కనపడుతున్నాయి. అదే సమయంలో ఓ యువకుడు అంజలికి అడ్డురావడంతో వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ తిట్ల పురాణంగా మారడంతో అక్కడ నుండి ఆ పబ్ నిర్వాహకులు అంజలిని జాగ్రత్తగా పంపించి వేసారు అని టాక్.

గత సంవత్సరం కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన 'గీతాంజలి'లో అందర్నీ భయపెట్టిన అంజలి ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగించడానికి మరో హారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'పిల్ల జమిందార్‌' సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈనెల 10వ తారీఖు వరకు అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్ ఈ మధ్యనే తిరిగి వచ్చింది. అయితే సరదాగా కాలక్షేపం కోసం నిన్న అంజలి చేసిన హంగామా హాట్ న్యూస్ గా మారడంతో మళ్ళీ అంజలి వార్తలతో ఫిలింనగర్ సందడి చేస్తోంది. ఇంతకీ ఈ వార్తలలో ఎన్ని నిజాలో అంజలికె తెలియాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: