7 పదుల వయసు దాటి పోయాక కూడా వరస పెట్టి సినిమాలు చేస్తూ వాణిజ్య సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ఇస్తూ టివి షోలు చేస్తూ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్న అమితాబ్ బచ్చన్ జీవితాన్ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యo కలుగుతుంది. వచ్చే నెల విడుదల కాబోతున్న అమితాబ్ నటించిన ‘షమితాబ్’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంటోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా అమితాబ్ మరో సంచలనాత్మక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. ‘3 ఇడియట్స్’, ‘పీకే’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విలక్షణ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించబోతున్న సంజయ్ దత్ జీవిత చరిత్రకు సంబంధించిన సినిమాలోని సంజయ్ దత్ తండ్రి పాత్ర సునీల్ దత్ గా అమితాబ్ నటించడానికి అంగీకరించాడు అని వార్తలు వస్తున్నాయి.

సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ చేస్తూ ఉండటంతో ఈ భారీ కాంబినేషన్ తో ఈ సినిమాకు విడుదల కాకుండానే మంచి క్రేజ్ ఏర్పడుతోంది. మంచి కుటుంబ నేపధ్యం నుండి వచ్చి మంచి నటుడిగా పేరున్న సంజయ్ దత్ జీవితం అంతా వివాదాల మయం.

చేసిన పొరపాటుకు ఈ రోజు శిక్షను అనుభవిస్తున్నా సంజయ్ దత్ విడుదల అయ్యాక అతడితో నిర్మించే సినిమాలు గురించి ఇప్పటి నుంచే బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు అంటే సంజయ్ దత్ జీవితం పై ఎంత మందికి సానుభూతి ఉందో అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: