టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఘనంగా రిలీజ్ అయిన నందమూరి హీరో చిత్రం పటాస్. పటాస్ మూవీ రిలీజ్ రోజే పాజటివ్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, కలెక్షన్స్ తో బాక్సాపీస్ వద్ద సత్తా చాటుతుంది. దీంతో కళ్యాణ్ రామ్ తెగ సంతోషంగా ఉన్నాడు. పటాస్ మూవీ ప్రదర్శించబడుతున్న అన్ని థియోటర్స్ నుండి హిట్ టాక్ రావడంతో అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్ లను అందుకుంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పటాస్ మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో థియోటర్స్ వద్ద ప్లోటింగ్ ఉన్నప్పుడే, మరికొన్ని థియోటర్స్ పెంచితే మంచిదని డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచించారు. ఎక్కడైతే భారీ రష్ ఉందో, అక్కడ మూడు నుండి నాలుగు థియోటర్స్ చొప్పున పటాస్ మూవీకి పెంచుతున్నారు. వీకెండ్ కలెక్షన్స్ లో కళ్యాణ్ బాక్సాపీస్ వద్ద సత్తా చాటుతాడని అంటున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆద్యంతం అలరించాడు. శృతి సోధి హీరోయిన్ మూవీకి గ్లామర్ ని తెచ్చిందని అంటున్నారు. ఇక పటాస్ సక్సెస్ కళ్యాణ్ తెగ సంతోషంగా ఉన్నాడు. త్వరలోనే పటాస్ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో కళ్యాణ్ రామ్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే పటాస్ సక్సెస్ టూర్ ని కూడ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ లాంగ్ గ్యాప్ తరువాత గ్రాండ్ సక్సెస్ ని పొందాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: