నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటించబోతున్న అప్ కమింగ్ మూవీలలో ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చేస్తుంది. ప్రస్తుతం బాలక్రిష్ణ పొలిటికల్ గా ప్రజలకు సేవలందిస్తూనే, సినిమా షూటింగ్ లకి కూడా సమయం కేటాయిస్తున్నాడు. తన 98వ సినిమా ‘లయన్’ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో బాలక్రిష్ణ ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే లయన్ మూవీని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లయన్ మూవీ తరువాత బాలక్రిష్ణ చేయబోతున్న అప్ కమింగ్ మూవీ డిటైల్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తన 99వ మూవీకి కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి రాసిన కథకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే సినిమాకి శ్రీ వాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో హన్సిక కూడ ఓ హీరోయిన్ గా చేస్తుందనే వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొదట హన్సిక, తన కాల్షీట్స్ లేవని రిజెక్ట్ చేయగా, కథ విన్న తరవాత తనకి బాగా నచ్చడంతో బాలక్రిష్ణ సరసన చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై అఫిషియల్ స్టేట్ మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఈ మూవీ ఫిబ్రవరి చివర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: