ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి'. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. చిత్రం ప్రారంభం నుంచి అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించన టాకీ పార్ట్ పూర్తయందనే విషయాన్ని బాహుబలి టీం అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఇదిలా ఉంటే బాహుబలి మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందనే విషయం తెలిసిందే. ఇందులోని మొదటి భాగంలో కథ ఎలా ఉంటుంది? అలాగే రెండో విభాగంలో కథని రాజమౌళి ఎలా లీడ్ చేస్తాడు? వంటి విషయాలు చాలా ఆసక్తి కరంగా మారాయి. బాహుబలి టీం నుండి వినిపిపస్తున్న సమాచారం ప్రకారం, బాహుబలి మూవీ మొదటి భాగం, కేవలం కథనంతో మాత్రమే ప్రారంభమై, కథనంతోనే ముగుస్తుంది. మధ్యలో మాత్రం ఓ భీకర యుద్ధ ద్రుశ్యాలు కొన్ని నిముషాలు ఉంటాయి. తరవాత చిత్రం అంతా, సాధారణ టాకీ పార్ట్ గానే ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే పై ద్రుష్టి సాధించిన రాజమౌళి, కథ నడిచే తీరును చాలా ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. మొత్తంగా రెండు భాగాలుగా రీలీజ్ అవుతున్న బాహుబలిలో అసలైన ద్రుశ్యాలు రెండో భాగంలో ఉన్నాయని ప్రోస్ట్ ప్రొడక్షన్ నుండి కూడ వినిపిస్తున్న టాక్. రాజమౌళి, బాహుబలి మూవీకి పెట్టిన బడ్జెట్ కేవలం మొదటి భాగంతోనే తిరిగి సంపాదించుకోవాలన్నదే టార్గెట్ గా కనిపిస్తుంది. ఇక రెండో భాగంతో వచ్చే మనీ అంతా నిర్మాతకి లాభాలే అన్న విధంగా తన మార్కెటింగ్ స్ట్రాటజీని రాజమౌళి ఇక్కడ చూపుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: