రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాహుబలి’ మూవీకి సంబంధించి 15 నిమిషాల నిడివిగల రావీడియో ఫుటేజ్ యూట్యూబ్‌లో లీకైందన్న వార్తల హడావిడి టాలీవుడ్ లో సంచలనాన్ని క్రియాట్ చేసింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పార్ట్‌కి సంబంధించిన 15 నిమిషాల వీడియో లీకైందని వార్తలు తెలుసు కున్న ‘బాహుబలి’ యూనిట్ సభ్యులు వెంటనే ఆ వీడియోని యూట్యూబ్‌లోంచి తొలగించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు టాక్.

ఈ విషయన్ని చాల తీవ్రంగా తీసుకున్న రాజమౌళి టీమ్ ఈ లీకేజ్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకు రావడంతో లీక్ చేసిన అసలు వ్యక్తి దొరికాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల బట్టి తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి’ సినిమా విజువల్ ఎఫెక్ట్ ఎడిటింగ్ జరుగుతున్న చోట గతంలో పనిచేసిన ఉద్యోగే ఇలా లీక్ అవ్వడానికి కారణం అని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం పై ఇంకా ఎటువంటి అధికార దృవీకరణ లేదు.

అయితే ఈ వ్యవహారం ఈ సినిమాకు ఎటువంటి చెడు చేయదని ఒక విధంగా ఈ సినిమాకు ఈ లీక్ వ్యవహారం మరోసారి పబ్లిసిటిగా ఉపయోగ పడిందని అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. దీనికి కారణం లీక్ అయిన ఈ వీడియోలో ఎటువంటి డబ్బింగ్ జరగలేదు కాబట్టి దీనివల్ల ఎటువంటి నష్టం ‘బాహుబలి’ జరగదు అని అంటున్నారు.

ఈ వార్తలు ఇలా ఉండగా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘బాహుబలి’ ట్రైలర్ కోసం సినిమా పరిశ్రమ అంతా ఆ శక్తిగా ఎదురు చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: