రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ కిక్ 2 మూవీని భారీగా నిర్మిస్తున్నాడు. కిక్ 2 మూవీకి సంబంధించి లొకేషన్స్ కూడ చాలా రిచ్ గా ఉండే విధంగా నిర్మాత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే కిక్ 2 లో రవితేజ డ్యూయిల్ రోల్ లో కనిపించనున్నాడని, అదీ తండ్రి,కొడుకులుగా అని తెలుస్తోంది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజపాల్ యాదవ్ కీలక పాత్రలో కనిపించటం. ఆ పాత్ర సినిమాలో పెద్ద హైలెట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ మూవీపై రవితేజా భారీ హాప్స్ పెట్టుకున్నాడు. కిక్ 2 మూవీ తరువాత రవితేజ్ తన రెమ్యునరేషన్ పెంచే పనిలో ఉన్నాడు. అందుకే రవితేజ కిక్ 2 తరవాత చాలా మూవీలకు కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉన్నా, వాటిని పెండింగ్ పెడుతూ వస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే కిక్ 2 మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. మొత్తంగా కిక్2 మూవీ తరువాత రవితేజ రెమ్యునరేషన్ ని ఎంత వరకూ పెంచుతారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: