టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తున్న అప్ కమింగ్ మూవీ టెంపర్. పూరీ జగన్నాధ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. అంతే కాకుండా పూరీ జగన్నాధ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ టెంపర్ మూవీపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. గతంలో పూరీ జగన్నాధ్ మూవీ లో కథ మాత్రమే కనిపించేది. కాని ఈ మధ్య కాలంతో పూరీ ఎక్కువుగా మీడియా ఇంటర్వూలు ఇవ్వడంతో, తన నిజ జీవితంలో ఏ విధమైన భావాజాలంతో ఉంటాడో, అలాగే తన మూవీలు కూడ అదే భావాజాలంతో కనిపిస్తున్నాయనే టెంపర్ మూవీని చూస్తే అర్ధం అవుతుంది.

పూరీ జగన్నాధ్ గతంలో ఓ ప్రవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తన జీవితంపై చెప్పుకున్న డైలాగ్ లనే, ఇప్పుడు టెంపర్ థియోట్రికల్ ట్రైలర్ లోనూ హీరో చేత వినిపించాడు. మొత్తంగా భారీ హంగామాతో రిలీజ్ అయిన టెంపర్ మూవీ థియోట్రికలర్ ట్రైలర్ లో హీరో చెప్పిన ప్రతి డైలాగ్ లోనూ వెనుక పూరీ జగన్నాధే ప్రేక్షకులకి కనిపిస్తున్నాడు.

ఇప్పటి వరకూ ఎన్టీఆర్ నటించిన మూవీ ఒక ఎత్తైతే, టెంపర్ లో నటించే ఎన్టీఆర్ స్టైల్ మరో ఎత్తు. చాలా మంది, టెంపర్ లో ఎన్టీఆర్ చాలా డిప్రెంట్ గా కనిపిస్తున్నాడని చెబుతున్నారు. జూనియర్ చెప్పిన డైలాగ్ లు, తన క్యారెక్టర్ అంతా కొత్తగా కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే డైరెక్టర్ మీద నమ్మకంతోనే ఎన్టీఆర్ ఈ మూవీని ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సినీ ప్రేక్షకులు మాత్రం టంపర్ ట్రైలర్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే పూరీ జగన్నాధ్ పైత్యం కూడ ఇందులో బాగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక మూవీ సక్సెస్ ఎలా ఉంటుంది అంటే అది రిలీజ్ తరువాతే తెలుస్తుంది. ఇది కచ్ఛితంగా వంద శాతం పూరీ జగన్నాధ్ మూవీ అని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: