తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీకి పెద్ద పీట వేస్తారు ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు కారణం తెలుగు లో ఉన్న కమెడియన్లే మరే ఇండస్ట్రీలో లేరంటే నమ్ముతారా ? ఇక్కడ కామెడీయన్లు కాస్ల క్లిక్ అయితే వారి దశ దిరిగినట్లే. హృదయ కాలెయంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంపూర్నేష్ బాబు దీనికి ఉదాహారణ. మనోడు వచ్చే రావడంతో సోషల్ నెట్ వర్క్ లో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకొని తనకు తానే బర్నింగ్ స్టార్ గా అందరికీ సుపరిచితుడు అయ్యాడు.

బర్నింగ్ స్టార్ అంటే అదేదో యాక్షన్ ఓరియెంటెడ్ అనుకోకండి కామెడీ ఓరియెంటెడ్. అసలు సంపూర్నేష్ బాబు ను చూస్తేనే నవ్వు తన్నుకొచ్చే స్తాయికి మనోడు తీసుకు వచ్చాడు. మొదటి సినిమాలో సంపూర్నేష్ సంపూర్ణమైన నటన ప్రదర్శించక పోయినప్పటికీ ఆ టైటిల్ చూసీ తను యూట్యూబ్ లో ఇచ్చిన బిల్డప్ కు పంచ్ డైలాగులకు తెలుగు ప్రేక్షకులు పడిపోయారు.

విషయానికి వస్తే మనోడి తెలుగు చిత్రపరిశ్రమలో దశ తిరిగిందనే చెప్పాలి కారణం మనోడికి వరుస ఆపర్లు వస్తున్నాయి. ఇప్పుడు అతనితో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు , నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం సంపూర్నేష్ బాబు కొబ్బరి మట్ట , మంచు మనోజ్ నిర్మాణంలో ‘సింగం 123′ సినిమాలో నటిస్తున్నాడు.

వీటికి తోడుగా మరో మూడు సినిమాల్లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. కొన్ని రోజుల్లో అధికారికంగా ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది. సంపూర్నేష్ కి రోల్ లో యాక్ట్ చేసిన ‘బందిపోటు’ సినిమాలో రెండు రోజుల క్రితం విడుదలయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో సంపూ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: