వరస పెట్టి రెండు ఫ్లాపులు వస్తే టాప్ హీరోలు కూడా భయపడిపోతున్న రోజులలో సంవత్సరాల తరబడి ఒక్క సినిమా కూడా కనీసం నాల్గవ వారం పోస్టర్ చూడక పోయినా క్రమం తప్పకుండ వరస పెట్టి సినిమాలు చేస్తున్న వరుణ్ సందేశ్ ప్రస్తుతం టాలీవుడ్ కు అర్ధంకాని పజిల్ గా మారిపోయాడు.

అంతేకాదు ఈ యంగ్ హీరోకు ఏమైనా సినిమా ఫ్యాక్టరీ ఉందా అంటూ వరుణ్ సందేశ్ ను టార్గెట్ చేస్తూ కొంత మంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఈనెల ఏకంగా జూనియర్ ను టార్గెట్ చేస్తూ ‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమా విడుదల చేసినా ఆ సినిమా పై చాలామంది రివ్యూలు కూడా రాయలేదు అంటే వరుణ్ సందేశ్ కెరియర్ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది.

అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరో ప్రయోగానికి వరుణ్ సందేశ్ రెడీ అయిపోతున్నాడు. ఈసారి ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తూ ముగ్గురు హీరోయిన్స్ తో నందమూరి తారకరామారావు బ్లాక్ బస్టర్ హిట్ ‘లవకుశ’ టైటిల్ ను తన సినిమా టైటిల్ గా మార్చుకుని చాల మంది మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో చాలా హాట్ సీన్స్ ఉన్నట్లుగా ఈ టీజర్ చూసిన వారికి అనిపిస్తోంది. బ్రహ్మానందం లాంటి టాప్ కమెడియన్ తో పాటు అనేకమంది సీనియర్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉన్నా శాటిలైట్ ఛానల్స్ కూడ ఈ యంగ్ హీరో పేరు చెపితే భయపడిపోతున్న రోజులలో వరుణ్ సందేశ్ పై ప్రయోగాలు చేస్తూ ధైర్యo చేస్తున్నవారు ఎవరో అర్ధం కాని పజిల్ గా మారిoది అంటూ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: