నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు ఈ సంవత్సరం ప్రారంభం నుండి బాగా కలిసి రావడంతో ప్రస్తుతం అతడు నిర్మాతగా మారి రవితేజతో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘కిక్ 2’ సినిమా తుది మెరుగులు దిద్దే విషయమై బిజీగా ఉన్నాడు. మొదట్లో ఈ సినిమాను తన తాత నందమూరి తారకరామారావు పుట్టినరోజునాడు మే 28న విడుదల చేద్దాము అని అనుకుంటూ ఉండగా ‘బాహుబలి’ విడుదల ఏప్రియల్ నుండి మేకు వాయిదా పడింది అనే వార్తలు వస్తుండటoతో కళ్యాణ్ రామ్ తన ‘కిక్ 2’ కు సంబంధించి రిలీజ్ యాక్షన్ ప్లాన్ పూర్తిగా మార్చేసాడు అనేవార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా రిలేజ్ డేట్ ను మే 7 అని ఖరారు చేసాడు అనితెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది అని టాక్.

కళ్యాణ్ రామ్ కు టాలీవుడ్ హీరోగా మొట్టమొదటి బ్రేక్ ఇచ్చిన ‘అతనొక్కడే’ సినిమా 10 సంవత్సరాల క్రితం ఇదే మే 7న విడుదలైంది. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్ కలిసి వచ్చి ఈ సంవత్సరం తనకు నిర్మాతగా కూడ కలిసి వస్తుంది అన్న ఆలోచనతో కళ్యాణ్ రామ్ ఈ మే 7వ తారీఖును టార్గెట్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

సురేంద్ర రెడ్డి కెరియర్ కు ఎంతో పేరుతెచ్చిన ‘కిక్’ సినిమాకు సీక్వెల్ గా నిర్మిస్తున్న ఈ ‘కిక్ 2’ ప్రేక్షకులకు డబల్ కిక్ ఇస్తుందనే నమ్మకంతో ఈసినిమా బడ్జెట్ అనుకోకుండా పెరిగినా కళ్యాణ్ రామ్ ఎటువంటి భయం లేకుండా నిర్మాతగా కూడా తనకు కలిసి వచ్చే సంవత్సరంగా ఈ ఏడాది తనకు టర్నింగ్ ఇస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: