అనుష్క అంటే అందానికి వొంపు సొంపు లకు కేరాఫ్ అడ్రస్ అంటారు. అందుకే అమ్మడికి కాస్త వయసొచ్చినా అందం ఫిట్ నెస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు సరికదా పాపులారిటీ మరింత పెరుగుతుంది. అంతేందుకు కొన్ని సినిమాలకు అనుష్క అయితేనే సెట్ అవుతుంది మరే హీరోయిన్ సెట్ అవదు అన్న రేంజ్ కి ఎదిగింది బొమ్మళి. టాలీవుడ్‌లో హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునేది అనుష్కనే.

ఆ మాటకొస్తే తమిళ్‌లో కూడా అనుష్క తర్వాతే ఎవరైనా క్రేజ్‌ విషయంలో అయినా, రెమ్యునరేషన్‌ విషయంలో అయినా కొత్త భామలు గట్టి పోటీ ఇస్తున్నా, అనుష్క ఫాలోయింగ్‌ కాస్త కూడా తగ్గలేదు. ఒకటీ అరా ఫ్లాపులొస్తున్నా అనుష్క కెరీర్‌పై అవేవీ ప్రభావం చూపడంలేదు. ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తున్న అనుష్క, తాజాగా ‘సైజ్‌ జీరో’ సినిమాకి కమిట్‌ అయ్యింది.

అయితే సైజ్ జీరో సినిమాలో అనుష్క డిఫరెంట్ గెటప్స్ లో కనబడబోతుందని అందుకే ఏరి కోరి మరీ ఆమెనే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అరుంధతి సినిమా తర్వాత అనుష్కకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బాగా గిరాకి పెరిగినట్లు తెలుస్తుంది. కారణం ఈ అమ్మడు ఆయా సినిమాలకు సరిగా సూటబుల్ అవుతుంది.

ముఖ్యంగా రాబోయే సినిమాలు బాహుబలి, రుద్రమదేవి భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు అందులో ముఖ్య రోల్ అనుష్కదే కాబట్టి ఈ అమ్మడి డిమాండ్ రోజుకింత పైపైకి వెళుతుంది. ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: