మోహన్ బాబు అంటే విలక్షన నటనకు కేరాఫ్ అడ్రాస్. 80 వ దశకంలో ఈయన విలనీజానికి కొత్త పేరు తీసకువచ్చారు. వెరైటీ డైలాగులతో డైలాగ్ కింగ్ పేరు తెచ్చుకున్నారు అప్పట్లో చిరంజీవి తీసే సినిమాలకు సరై ప్రతి నాయకుడు ఎవరయ్యా అంటే టక్కున చెప్పొచ్చు మోహన్ బాబే అని ఎందు కంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు అంత క్రేజ్ ఉండేదన్నమాట. మోహన్ బాబు విలనీజమే కాదు కామెడీ, హీరోయిజం కూడా అతే స్థాయిలో చేసి మెప్పించగల నటుడు.

దాసరి నారాయణరావు ఈయనకు సినీ జీవితాన్ని ప్రసాదించారని గురు భక్తి చాటుకుంటూ తన నటనా జీవితంలో ఆయనకు ఎంతో ప్రాధాన్యత కూడా ఇస్తారు. వాస్తవానికి దాసరి నారాయణ రావు దర్శకుడిగా చాలా సినిమాల్లో మోహన్ బాబుకి అవకాశాలు ఇచ్చి ఆయన సినీ జీవితంలో ఎత్తో ఎత్తుకు ఎదిగేలా చేశారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ సొంతగా ఏర్పరచుకొని మోహన్ బాబు హీరోగా కూడా మంచి హిట్ సినిమాలే తీశారు.

ఇక మెగా కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే ఎందుకంటే ఆయనకు ఉన్న ఇమేజీ ఏ స్థాయిలో ఉందో టాలీవుడ్ ను ఎలా ఏలుతున్నాడో చెప్పనక్కర లేదు. ప్రస్తుతం పవన్ తో సినిమాలు తీయాలంటే డైరెక్టర్లు, నిర్మాతలు ఏవిధంగా క్యూ కడుతున్నారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ తో దాసరి నిర్మించే చిత్రంలో విలన్ గా మోహన్ బాబు నటించనున్నట్లు తెలియవస్తుంది. వాస్తవానికి ఇది అధికారిక వార్త కాకపోయినప్పటికీ మోహన్ బాబు మాత్రం ఆ సినిమాలో నటించవచ్చు అని అనుకుంటున్నారు.

ఎందుకంటే దాసరితో మోహన్ బాబుకు ఉన్న అనుబంధం అలాంటిది. దాసరి, పవన్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు మరి అలాంటి సినిమాలో ఆయకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది కదా మరి అది ప్రతి నాయకుడి పాత్ర వస్తే సినిమా ఎంత క్రేజీగా ఉంటుందో అని సినీ వర్గాలు, పవన్ అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: