గతదశాబ్ద కాలంగా సినిమారంగలో హీరోగా నిలదొక్కుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాకుండా సొంతంగా సినిమాలుతీసి ఎన్నో కోట్లు నష్ట పోయిన కళ్యాణ్ రామ్ కు తన లేటెస్ట్ సినిమా పటాస్ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం రవితేజాతో ‘కిక్ 2’ తీస్తున్న విషయం తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ కు ఈ కిక్ సరిపోయినట్లు లేదు.

అందుకే ఇక ఏకంగా తన బాబాయ్ బాలకృష్ణ 100వ సినిమాకు నిర్మాతగా మారిపోదామని ప్లాన్స్ వేయడమే కాకుండా ఏకంగా బాలయ్య 100వ సినిమా కథలు తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు అని టాక్. అంతేకాదు ఇప్పటికే రెండు కథలను బాలకృష్ణకు వినిపించాడు అనే వార్తలు కూడ వస్తున్నాయి.

అయితే బాలకృష్ణ తన 100వ సినిమాను నిర్మించే అవకాశం దర్శకుడు రాజమౌళికి ఆప్తుడైన వారాహి ఫిలిమ్స్ కొర్రపాటి సాయికి ఇవ్వాలని ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చిన నేపధ్యంలో కళ్యాణ్ రామ్ తన పై తెస్తున్న ఒత్తిడికి ఎటువంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోతున్నాడని టాక్.

అదీ కాకుండా తన కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే మొదటి సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తాను అని కొర్రపాటి సాయి బాలయ్యను ఆడుతున్న నేపధ్యంలో తన 100వ సినిమాను వారాహి ఫిలిమ్స్ కు ఇస్తేనే అన్ని విధాల బాగుంటుందని బాలయ్య వ్యూహాత్మక ఎత్తుగడ అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇన్ని చిక్కు ముడులు ఉన్న ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ఒత్తిడి ఏమిటి అని బాలయ్య తల పట్టుకుంటున్నాడు అని రూమర్..

మరింత సమాచారం తెలుసుకోండి: