దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ‘బాహుబలి’ విడుదల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో మరో ముఖ్య నిర్ణయం ఈ సినిమాకు సంబంధించి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఎంతో పాపులారిటీ పొందిన ఈసినిమా టైటిల్ రాజమౌళి మార్చబోతున్నాడు అని టాక్. అయితే ఈ మార్పులు ‘బాహుబలి’ తమిళ వర్షన్ లో జరుగుతాయని అంటున్నారు.

తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ లో మాత్రం ‘మహాబలి’ పేరుతో విడుదల చేద్దామని రాజమౌళి ఆలోచిస్తూ వచ్చాడు. అయితే ఈ సినిమా కోలీవుడ్ రైట్స్ కొనుక్కున్న ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధినేతలు ఈ సినిమా పేరును మార్చమని రాజమౌళి పై వొత్తిడి చేస్తున్నట్లు టాక్.

దీనికి కారణం కోలీవుడ్ వెబ్ మీడియాలో కూడా ఈ సినిమాకు ‘మహాబలి’ పేరు మీద కంటే ‘బాహుబలి’ పేరు మీదే ఎక్కువ మంది సర్చ్ చేస్తూ ఉండటంతో తమిళ వర్షన్ ను కూడా ‘బాహుబలి’ పేరునే విడుదల చేయమని ఈ సినిమాను కొనుక్కున్న స్టూడియో గ్రీన్ అధినేతలు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈవార్తలు ఇలా ఉండగా ఈసినిమా మే 22న విడుదల కాబోతోంది అని తమిళ మీడియాలో అధికారికంగా వార్తలు వస్తున్నాయి. అయితే అనుకున్న విధంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాక మరొకసారి వాయిదా పడితే దాని ప్రభావం మొట్టమొదటి సారిగా ఒక డైరెక్ట్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న తన కెరియర్ పై నెగిటివ్ ప్రభావాన్ని చూపెడుతుందని ప్రభాస్ స్టూడియో గ్రీన్ అధినేతల పై కోపంగా ఉన్నాడు అని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: