ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫీవర్ లో కేవలం దక్షిణాది సినిమాలకు పరిమితమై పోయిన ప్రియమణి శ్రియల ప్రస్తావన చోటు చేసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. టీమ్ ఇండియా వేసుకుంటున్న టీ షర్టుల పై శ్రియ ప్రియమణిల పేర్లు కనిపించడం మీడియాకు షాకింగ్ గా మారింది. అయితే ఈ టీ షర్టుల పై ప్రియమణి శ్రియల పేర్లు ఉండటం వాస్తవమే అయినా ఆ టి షర్టులు మాత్రం కేవలం ఈ బ్యూటీలు ఇద్దరికే పరిమితం.

ఇక వివరాలలోకి వెళితే వరల్డ్ కప్ లో పాల్గొంటున్న టీమ్ ఇండియా సభ్యుల కోసం బ్లూ కలర్ లో టి షర్టులను డిజైన్ చేసిన ‘నైక్’ కంపెనీ మరికొన్ని టీ షర్టులను తయారుచేసి ఆ షర్టుల వెనుక భాగం పై ‘శ్రియ’, ‘ప్రియ’ అన్న పేర్లు ప్రింట్ చేసి ఈ ఇద్దరు బ్యూటీలకు ‘నైక్’ కంపెనీ యాజమాన్యం బహుమతిగా ఇచ్చిందట.

ఈ అనుకోని బహుమతులకు ముచ్చట పడ్డ ఈ బ్యుతీలు ఇద్దరు తాము కూడ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న టీమ్ ఇండియా మెంబర్లు అయిపోయినంత హడావిడి చేస్తూ ఆ టీ షర్టుల ఫోటోలను తమ ఫేస్ బుక్ లో పెట్టి నానా హడావిడి చేస్తున్నారు. ఈమధ్య కాలంలో సినిమాలు లేక ఫ్యాషన్ పెరేడ్ లలో ర్యాంప్ వాక్ లు చేస్తూ కాలం గడుపుతున్న శ్రియ, కన్నడ సినిమాలలో నటిస్తూ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ప్రియమణి ఈ టి షర్టుల హంగామాతో మళ్ళీ వార్తల కెక్కారు.

సినిమా తారలకు క్రికెట్ స్టార్లకు అవినాభావ సంబంధం ఏనాటి నుండో ఉన్న విషయమే కాబట్టి వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లకపోయినా ఆ మ్యాచ్ లకు నిజంగానే బ్రాండ్ అంబాసిడర్ లుగా మారినట్లు ఫీల్ అవుతున్నారు ఈ బ్యూటీలు..

మరింత సమాచారం తెలుసుకోండి: