పవన్ అభిమానులు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా..? అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య వారికి షాక్ మీద షాక్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. దాసరి నారాయణ రావు పవన్ తో సినిమా నిర్మిస్తున్నారని వార్తలు వినపడగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అంతేనా ఆ సినిమా కమర్షియల్ కాకుండా సమాజానికి ఉపయోగ పడే సందేశాత్మక చిత్రం అని దీని పర్యవేక్షన బాధ్యతలు పవనే వహిస్తారని అబ్బో రక రకాలుగా ప్రచారాలు జరిగాయి. అయితే దాసరికి మెగా ఫ్యామిలీకి పెద్దగా రిలేషన్ ఏమీ లేదనే చెప్పాలి.

అంతే కాదు దాసరి కి చిరు కుటుంబానికి మద్య గతకొంత కాలంగా వైరుద్యం ఉన్నమాట వాస్తవమే ! పైగా ప్రజారాజ్యం పార్టీ ని స్థాపించిన కొత్తలో ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా మేస్త్రి అనే సినిమా కూడా చేసాడు అలాంటిది దాసరికి పవన్ సినిమా చేస్తానని మాట ఇవ్వడం ఏంటని మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు .

ఈ మధ్య కాలంలో అన్నయ్యతో అనుబంధాలు కాస్త దూరం అయిన పవన్ దాసరి తోడ్పాటు ఏమిటా అని అనుకుంటున్నారు. బహుషా ఇది ఎవరి ప్రయోజనం ఆశించి పవన్ వెనుక ఉండి చేయిస్తున్నారో అని పవన్ అభిమానులకు ఇఫ్పటికీ అర్థం కాని విషయం. ఏది ఏమైనా దాసరి రూపొందించే సినిమా పవన్ కళ్యాన్ హీరో ఇక తెరపై చూడాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: