తెలుగు సినిమాలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తే నానా కష్టాలు పడి ఆ అమ్మాయిని దక్కించుకొని హీరో అవుతాడు. మరి నిజ జీవితంలో కూడా అలాంటి సందర్భమే వస్తే రావడమేంటీ వచ్చింది మరి ఆ హీరో ఎవరో కాదు మన మంచు వారి అబ్బాయి అదే నండీ మంచు మనోజ్. తన వదిన ఫ్రెండ్ స్నేహితురాలు ప్రణతితో మనోడికి గత కొంత కాలంగా ప్రేమాయణం నడిచింది.

అయితే ఈ ప్రేమకు ఎవరూ అడ్డు చెప్పకుండా సున్నితంగా అందరినీ ఒప్పించాడు. అంతే కాదండోయ్ నిశ్చితార్థం కూడా సెట్ చేయించాడు. మార్చి 4న బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా తన నిశ్చితార్థ కార్యక్రమానికి వెదిక చేస్తున్నాడు. అంటే మనోడు సినిమాల్లో నే కాదు నిజ జీవితంలో కోరుకున్న అమ్మాయిని తన అర్ధాంగిగా చేసుకోబోతున్నాడన్న మాట.

వాస్తవానికి టాలీవుడ్ లో ఇలాంటివి మామూలే అల్లూ అర్జున్, రామ్ చరణ్ లాంటి కుర్రహీరోలు తాము ప్రేమించిన అమ్మాయిలతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో సినిమాల్లో లాగా పెద్దలు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా తమ పిల్లలు ఇష్ట పడ్డ వారికే ఓటేసి వారి పెద్దరికం నిలుపుకుంటున్నారు.

ఈ నిశ్చితార్థ నికి సినీ ఇండస్ట్రీ పెద్దలు, మంచు ఫ్యామిలీ సన్నిహితులు, రాజకీయ నాయకులు విచ్చేస్తున్నట్లు సమాచారం. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే మంచు విష్ణు ది కూడా ప్రేమవివాహమే. మొత్తానికి మంచు వారి అబ్బాయిలు తాము ఇష్ట పడ్డ వారినే పెళ్లి చేసుకొని నిజజీవితంలో కూడా హీరోలు అయ్యారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: